Thaman: ఆ సినిమా సెట్స్ లో అందరికి టార్చర్ చూపించా..! 1 y ago

featured-image

'బాయ్స్' సినిమా సమయంలో సెట్ లో జరిగిన సరదా సన్నివేశాలను పంచుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఆ సినిమా తీస్తున్నప్పుడు సెట్స్ లో తాను చాలా అల్లరి చేసేవాడినని తెలిపారు. ఆ సమయంలో దర్శకుడు శంకర్ వద్ద అరివళగన్ అసిస్టెంట్ గా చేసేవారని చెప్పారు. తన అల్లరి భరించలేక అరివళగన్ ను తనకు కాపలాగా పెట్టేవారన్నారు. 'శబ్దం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన 'శబ్దం' చిత్రాన్ని అరివళగన్ తెరకెక్కించారు. దీనికి తమన్ స్వరాలు సమకూర్చారు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD